• Login / Register
  • Telangana Inter Board | ఇంట‌ర్ ప‌రీక్ష ఫీజు తేదీలు ఖ‌రారు

    Telangana Inter Board | ఇంట‌ర్ ప‌రీక్ష ఫీజు తేదీలు ఖ‌రారు
    ఈ నెల 6 నుంచి 26 వ‌ర‌కు ఫీజు చెల్లింపున‌కు గ‌డువు
    షెడ్యూల్ విడుద‌ల చేసిన తెలంగాణ ఇంట‌ర్ బోర్డు

    Hyderabad : రాష్ట్రంలో ఇంట‌ర్ ప‌రీక్ష‌ ఫీజు తేదీలు ఖ‌రారు చేస్తు తెలంగాణ ఇంట‌ర్ బోర్డు అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నెల 6 నుంచి   నుంచి 26 వ‌ర‌కు ప‌రీక్ష ఫీజు చెల్లింపున‌కు గ‌డువు తేదీ విధించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ప‌రీక్ష ఫీజు తేదీలు ప్ర‌క‌టించారు.  గ‌డువు తేదీ అనంత‌రం రూ. 100 ఆల‌స్య రుసుంతో న‌వంబ‌ర్ 27 నుంచి డిసెంబ‌ర్ 4వ తేదీ వ‌ర‌కు ఫీజులు చెల్లింపున‌కు గ‌డువు ఉంది. రూ. 500 ఆల‌స్య రుసుంతో డిసెంబ‌ర్ 5 నుంచి 11 వ‌ర‌కు, రూ. 1000 ఆల‌స్య రుసుంతో డిసెంబ‌ర్ 12 నుంచి 18 వ‌ర‌కు, రూ. 2000 ఆల‌స్య రుసుంతో డిసెంబ‌ర్ 19 నుంచి 27 వ‌ర‌కు చెల్లించే అవ‌కాశం క‌ల్పించామ‌ని బోర్డు సెక్రెట‌రీ తెలిపారు. ఫ‌స్టియ‌ర్ జ‌న‌ర‌ల్ కోర్సుల‌కు రూ. 520, వొకేష‌న‌ల్ కోర్సుల‌కు రూ. 750, సెకండియ‌ర్ జ‌న‌ర‌ల్ ఆర్ట్స్ కోర్సుల‌కు రూ. 520, సైన్స్, వొకేష‌న‌ల్ కోర్సుల‌కు రూ. 750గా ఫీజు నిర్ధారించారు.
    *  *  *

    Leave A Comment